Wednesday, January 22, 2025

లేటు వయసులో ఘాటు ప్రేమ… ఆస్ట్రేలియా ప్రధానికి రెండో పెళ్లి

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్(60) రెండో వివాహం చేసుకోబోతున్నారు. ఆర్థిక సేవల నిపుణురాలు జోడీ హేడన్, ఆంథోనీ లేటు వయసులో ఒకటి కానున్నారు. ఇద్దరు మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నట్టు సమాచారం.  ఆస్ట్రేలియా ప్రధాని బాధ్యతలు చేపడుతూ పెళ్లి చేసుకుంటుండంతో ఆయన రికార్డులకెక్కనున్నాడు. 2019లో మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు 23 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు తన ప్రేమకు ఆంథోనీ అంగీకరించారని తన ఎక్స్‌లో హేడన్ రాసుకోచ్చారు. ఈ ప్రేమ జంట మే నెల నుంచి ఆగస్టు మధ్యలో పెళ్లి చేసుకుంటున్నట్టు సమాచారం.  ఆందోని పెళ్లికి ఒప్పుకోవడంతో చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఇవాళ అద్భుతమైన రోజు అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News