Sunday, February 2, 2025

ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ భారత్ పర్యటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జి20 సదస్సుకు హాజరయ్యేందుకు ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ సెప్టెంబర్ 9,10 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత్‌కు ఆయన వస్తారని ఆస్ట్రేలియా శనివారం వెల్లడించింది. భారత్‌తోపాటు ఇండోనేసియా, ఫిలిప్పైన్స్‌లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరగనున్న జి20 సదస్సులో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో పాల్గొంటారు. అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో ఆస్ట్రేలియా కలిసి పనిచేయడం ఇదివరకటి కన్నా ఇప్పుడు ఎంతో ముఖ్యమని, ఎదురౌతున్న సవాళ్లు, అవకాశాలపై చర్చించడానికి జి20 వంటి బహు పార్శ ఆర్థిక వేదికలపై పాలుపంచుకోవలసిన అవసరం ఉందని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News