- Advertisement -
కాన్‌బెర్రా : ఆస్ట్రేలియాలో జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఓడించింది. ఈమేరకు శనివారం స్కాట్ మోరిసన్ తన ఓటమిని అంగీకరించారు. దీంతో కొత్త ప్రధానిగా లేబర్ పార్టీ నాయకుడు ఆంథోనీ అల్బనీస్ బాధ్యతలు చేపట్టనున్నారు. లిబరల్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా నాయకత్వం నుంచి కూడా మోరిసన్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. గెలుపు ఓటమిలకు నాయకుడిగా తాను పూర్తి బాధ్యత వహిస్తానని, లిబరల్ పార్టీకి నాయకత్వం వహించడం గొప్ప అదృష్టమని మోరిసన్ చెప్పారు. ఈ గొప్పదేశానికి తనను నాయకుడిగా చేసేందుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. కొత్త నాయకత్వంలో తమ పార్టీ మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నానని చెప్పారు.
- Advertisement -