లాహోర్: పాకిస్థాన్ జట్టుతో గురువారం ఆడిని మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ వేగంగా 8000 టెస్ట్ రన్నులు చేశాడు. నిర్ణయాత్మక థర్డ్ మ్యాచ్ నాలుగో రోజున, తన 85వ టెస్టులో 151వ ఇన్నింగ్స్‌లో ఆయన ఈ ఘనత సాధించాడు. అతడు శ్రీలంకకుచెందిన కుమార్ సంగకర రికార్డును ఛేదించాడు. సంగకర 12 ఏళ్ల క్రితం కొలంబోలో భారత్‌కు వ్యతిరేకంగా ఆడిన ఆటలో 152వ ఇన్నింగ్స్‌లో రికార్డు సాధించాడు. 8000 పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌లలో స్మిత్ 132వ బ్యాట్స్‌మన్. కాగా ఆస్ట్రేలియా నుంచి 7వ బ్యాట్స్‌మన్. స్మిత్ తన కెరీర్‌ను లెగ్ బ్రేక్ బౌలర్‌గా ఆరంభించాడు. 2010లో లండన్‌లోని లార్డ్ స్టేడియంలో పాకిస్థాన్‌తో ఆడిన ఆస్ట్రేలియా న్యూట్రల్ వెన్యూ సిరీస్‌లో తన డెబును ఆరంభించాడు. కాలక్రమేణ అతడు ఆస్ట్రేలియా మేటి బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. 27 శతకాలు, 60.10 ఇంప్రెసివ్ యావరేజ్‌తో తనదైన చరిత్ర సృష్టించుకున్నాడు.
టెస్ట్ రన్నులో ‘ఫాస్టెస్ట్ మ్యాన్’గా నిలిచిన స్టీవ్ స్మిత్!
- Advertisement -
- Advertisement -
- Advertisement -