- Advertisement -
వియన్నా: యూరోప్‌లోని ఆస్ట్రియాలో అతి తక్కువగా కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకున్న ప్రజలున్నారు. అక్కడ కేవలం 65 శాతం మంది ప్రజలే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. దాంతో అక్కడ మళ్లీ మహమ్మారి కేసులు పెరిగాయి. అది రికార్డు స్థాయికి పెరిగాయని అక్కడి ఛాన్సలర్ అలెగ్జాండర్ షాలెన్‌బర్గ్ తెలుపుతూ ఆ దేశంలో లక్షలాది మంది వ్యాక్సిన్ వేయించుకోవారిని లాక్‌డౌన్ చేయాల్సిందిగా (నిర్బంధించాల్సిందిగా) ఆదివారం ఆదేశాలిచ్చారు. “మేము వ్యాక్సిన్ రేటును పెంచాల్సి ఉంది. తక్కువగా ఉన్నందుకు సిగ్గుగానూ ఉంది” అని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆస్ట్రియాలోని తొమ్మిది ప్రాంతాల గవర్నర్లతో ఆయన వీడియో కాల్‌లో మాట్లాడారు. కోవిడ్-19కు దాదాపు 65 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్నారని, ఇది పశ్చిమ యూరోప్‌లోనే అతి తకువ రేటని ఆయన తెలిపారు.
- Advertisement -