Wednesday, January 22, 2025

తప్పనిసరి వ్యాక్సిన్ చట్టాన్ని సస్పెండ్ చేసిన ఆస్ట్రియా

- Advertisement -
- Advertisement -

covid vaccine

వియన్నా: వయోజనులందరికీ కొవిడ్19 వ్యాక్సినేషన్ తప్పనిసరి అన్న చట్టాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ఆస్ట్రియా బుధవారం తెలిపింది. యూరొపియన్ యూనియన్‌లో చట్టం అమలులోకి వచ్చిన నెల తర్వాత ఈ నిర్ణయాన్ని ఆస్ట్రియా తీసుకుంది. ఆస్ట్రియా జనాభా 90 లక్షలు ఉంటుంది. వయోజనులకు కరోనా వ్యాక్సినేషన్ తప్పనిసరి అన్నదానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న దేశాల సరసన ఇప్పుడు ఆస్ట్రియా చేరింది. ఆస్ట్రియాలో తప్పనిసరి వ్యాక్సినేషన్ చేయించుకోవాలని లేకపోతే 3,600 యూరోలు(3,940 అమెరికన్ డాలర్లు) ఫైన్ కట్టాల్సి ఉంటుందని మార్చి మధ్యభాగంలో చట్టం తెచ్చింది.
‘ప్రాథమిక హక్కులను కబలించే చట్టాన్ని ఇంకా ఎంతో కాలం సమర్థించలేము’ మంత్రి కరోలిన్ ఎడ్‌స్టాడ్లర్ తెలిపారు. ఆయన ఇంకా ‘ఆరోగ్య మంత్రితో సంప్రదించాకే, మేము నిర్ణయం తీసుకున్నాము. అయితే మేము నిపుణుల కమిటీ చెప్పేదాన్ని తప్పక అనుసరిస్తాం. ఇక్కడ మనం ఎదుర్కొంటున్న ఒమిక్రాన్ వేరియంట్ ఎందుర్కొంటున్నాం. ఇప్పుడు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా మాకు కనపడ్డంలేదు. ఒమిక్రాన్ వేరియంట్ ఇదివరకటి వేరియంట్ల కన్నా తక్కువ తీవ్రమైనది. ఒమిక్రాన్ కేసులను ఎదుర్కొనడానికి ఆస్ట్రేలియా ఆసుపత్రులు సమర్థంగానే ఉన్నాయి.’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News