Sunday, January 5, 2025

కిమ్ కర్దాషియాన్ తో డేటింగ్ చేసిన బిలియనీర్ లుగ్నర్ మృతి

- Advertisement -
- Advertisement -

రిచర్డ్ లుగ్నర్ ఆస్ట్రియాలో బిలియనీర్.  తన 91 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆయన ఇటీవలి నెలల్లో అనేక ఆరోగ్య సమస్యలతో పోరాడాడు, గుండె శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. అతనికి నలుగురు పిల్లలు. ఆస్ట్రియా రాజధాని నగరం వియన్నాలోని  ఐకానిక్ ఒపెరా బాల్‌లో కిమ్ కర్దాషియాన్, సోఫియా లోరెన్, జేన్ ఫోండా, పమేలా ఆండర్సన్ , గోల్డీ హాన్ వంటి గ్లోబల్ సెలబ్రిటీలకు ఆతిథ్యం ఇచ్చి లుగ్నర్ ప్రసిద్ది చెందారు.

రెండు నెలల క్రితం, లుగ్నర్ ఆరోసారి వివాహం చేసుకున్నాడు. ఆయన జూన్ 1న 42 ఏళ్ల మహిళ సిమోన్ రైలాండర్‌ను వివాహం చేసుకున్నారు. “ఇది చివరి వివాహం” అని ఆయన ఆ సమయంలో అన్నారని  స్థానిక మీడియా పేర్కొంది.

కిమ్ కర్దాషియాన్‌ డేటింగ్ ఆశిస్తూ 500000 డాలర్లు  లుగ్నర్ చెల్లించాడు. కాగా “కిమ్ నన్ను బాధపెడుతోంది, ఎందుకంటే ఆమె ప్రోగ్రామ్‌ డేట్ కు కట్టుబడి లేదు” అని లుగ్నర్ తెలిపాడని 2014లో  ‘పేజ్ సిక్స్’ నివేదించింది. పైగా అతను లిండ్సే లోహాన్‌కు 150,000 డాలర్లు చెల్లించి 2010 వియన్నా ఒపెరా బాల్‌కు తన డేట్‌ తీసుకున్నాడని రిపోర్టు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News