Monday, December 23, 2024

సల్మాన్ రష్డీకి కత్తిపోట్లు

- Advertisement -
- Advertisement -

సల్మాన్ రష్దీకి కత్తిపోట్లు
న్యూయర్క్‌లో వేదికపైనే దాడి, హెలికాప్టర్‌లో చికిత్సకు తరలింపు

న్యూయార్క్ : వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీపై (75) శుక్రవారం దాడి జరిగింది. కత్తిపోట్ల కు గురయ్యారు. న్యూయార్క్ సా హిత్స ఉత్సవంలో (లిటరరీ ఫెయి ర్) ఆయన ఓ ప్రసంగ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక్కడి చౌటాయూక్యూ సంస్థలో స్టేజీపైకి వచ్చి ప్ర సంగించనుండగా ఓ వ్యక్తి వచ్చి ఆయనను కత్తితో పొడిచారని, అంతా చూ స్తూ ఉండగానే 10నుంచి 15 సార్లు కత్తితో పొడిచారని ప్రత్యక్ష సాక్షి ఒక రు తెలిపారు. వెంటనే ఆ వ్యక్తిని అడ్డుకున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. దాడి వివరాలు పూర్తిగా వెంటనే తెలియలేదు. వేదికపై పడిపోయిన రష్దీని వెంటనే అక్కడినుంచి కిందకు తీసుకువెళ్లి, ఓ హెలికాప్టర్‌లో న్యూయార్క్ సిటీలోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. సటానిక్ వర్సెస్ పుస్తక రచనతో 1980 నుంచి ఆయనకు ప్రాణాలు తీస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఇరాన్ ఫత్వా వెలువరించిన 33 సంవత్సరాలకు ఈ రచయితపై దాడి జరిగింది. ఇస్లాం వ్యతిరేక భావనలతో సటానిక్ నవల రాశారని పేర్కొంటూ ఇరాన్ ఇతర దేశాలలో దీనిని నిషేధించారు. రష్దీ ఇప్పుడు అమెరికాలో ప్రవాసంలో ఉంటున్నారు. వేదికపై దాడికి గురై, సల్మాన్ రష్దీ వేదికపై కిందపడ్డారు.భారతీయ సంతతికి చెందిన రష్డీ బ్రిటిష్ పౌరసత్వం పొందారు. గత 20 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నారు. దాడి ఘటనపై వెంటనే లండన్‌లోని రష్దీ కుమారుడు జాఫర్ తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపైఆరా తీస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News