Monday, December 23, 2024

ఆటిజం ప్రాణాల్ని తీస్తుందా ?

- Advertisement -
- Advertisement -

ఇన్నాళ్లూ పాశ్చాత్య దేశాల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపించేది. కానీ మనదేశం లోనూ రోజురోజుకీ పెరుగుతోంది. ఆటిజం అంటే నిజానికి వ్యాధి కాదు. ఇది మెదడు పనితనంలో ఏర్పడిన ఒక లోపం మాత్రమే. సాధారణంగా ఆటిజం లక్షణాలు మూడేళ్లు నిండక ముందే కనిపిస్తాయి. దీని ప్రభావం వల్ల మానసిక వైద్యుల వద్దకు వెళ్తున్న పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అమెరికా జర్నల్ ఆస్టీమ్‌కు చెందిన శాస్త్రవేత్తలు 18 నుంచి 30ఏళ్ల మధ్య వయసున్న 163 మందిపై ఆటిజం లెవెల్స్, డిప్రెషన్, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలపై పరిశోధనలు జరిపారు.

ఆ పరిశోధనలను యుఎస్ ఫెడరల్ అడ్వైజరీ కమిటీకి అందజేశారు. దీని ఆధారంగా రీసెర్చిలో పాల్గొన్న ఎక్కువ శాతం మందికి ఆటిజం లెవెల్స్ అధికంగా ఉన్నాయని తేలింది. ఎలాంటి ఒత్తిడి, ఆందోళన కలిగినా, ఆత్మహత్యే తమ మార్గంగా ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. 2020 ఫిబ్రవరి 19న హెల్త్‌డే న్యూస్ వెబ్ జర్నల్‌లో గర్భవతులు, పాలిచ్చే తల్లులు, పసిపిల్లలూ థేలెట్స్ అనే విష రసాయనాలు కలిపిన ప్లాస్టిక్ పాత్రలో పానీయాలు , ఆహార పదార్థాలు తీసుకుంటే అవి ఆ శిశువులో ఆటిజానికి కారణం అవుతాయనే అంశం మీద అధ్యయనాలు వెలువడ్డాయి.

కెనడా దేశానికి చెందిన నాలుగు నెలల లోపు గర్భవతులు 2 వేల మందిని 2008 2011 మధ్యకాలంలో పరిశీలించి ఈ పరిశోధన చేసినట్టు ఆ నివేదిక చెబుతోంది. ఈ తల్లుల్లో ధేలెట్స్ ఎక్కువగా వాడి, పోలిక్ యాసిడ్ తక్కువగా వాడిన వారి పిల్లల్లో 34 ఏళ్లు వచ్చేసరికి వారిలో ఆటిజం లక్షణాలు కనిపించినట్టు ఈ పరిశోధకులు నిర్ధారించారు. ఈ పరీక్షల క్రమంలో ఆడపిల్లలకి ఈ వ్యాధి సోకలేదనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. దానికి కారణాన్ని విశ్లేషించలేక పోయినప్పటికీ, బహుశా హార్మోన్ల ప్రభావం దీని మీద ఉండచవ్చన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News