- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో సిఎన్‌జి సబ్సిడీని, ఛార్జీల పెంపును డిమాండు చేస్తూ ఆటో రిక్షా, క్యాబ్, ట్యాక్సీ యూనియన్లు రెండు రోజుల సమ్మెకు పిలుపునివ్వడంతో సోమవారం దేశరాజధానిలో ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడ్డారు. ఓలా, ఊబర్ క్యాబ్‌ల కోసం చాలా సమయం వేచి ఉండాల్సి వస్తోందని, దొరికిన క్యాబ్‌ల ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. వివిధ ఆటో రిక్షా, క్యాబ్, ట్యాక్సీ యూనియన్ల సమ్మె ప్రభావం రైల్వే స్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్సు టెర్మినల్స్, మెట్రో స్టేషన్ల వద్ద కనిపించింది. ఆటో రిక్షాలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు దొరకక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైలు, బస్సు లేదా ఇతర మార్గాల ద్వార ఢిల్లీ చేరుకున్న ఇతర రాష్ట్రాల వారు సమ్మె కారణంగా అవస్థలు పడ్డారు.
- Advertisement -