Thursday, January 23, 2025

ఈనెల 19వ తేదీన ఆటో, క్యాబ్, లారీల బంద్

- Advertisement -
- Advertisement -

Auto, cab and lorries sevices will be closed on May 19th

మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు సంబంధించి గోడపత్రికను హైదరాబాద్, హైదర్‌గూడలో జేఏసి నాయకులు ఆవిష్కరించారు. 19వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. 19న బంద్‌రోజు రవాణా శాఖ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు వారు తెలిపారు. కరోనా కష్ట కాలంలో కార్మికులను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం జీఓ 714 తీసుకొచ్చి ఫిట్‌నెస్ రెన్యువల్ పేరుతో రోజుకు 50 పెనాల్టీ వేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News