Thursday, January 23, 2025

విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా: విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జిల్లాలోని శంకర్ పల్లి మండల శివారులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. శంకర్ పల్లి వద్ద పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన సంఘటనలో 9 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటో 15 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News