Saturday, January 25, 2025

20 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఓ 20 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఆ యువతిని రైల్వే స్టేషన్ లో కనుగొన్నారు. తనపై అత్యాచారం జరిగన విషయం  తండ్రికి తెలిస్తే తననూ, తల్లిని కొట్టి వేధిస్తాడని భయపడిన ఆ యువతి మర్మావయంలో ప్లాస్టిక్ కాగితంలో చుట్టిన సర్జికల్ బ్లేడ్, రాళ్లు వేసుకుందని పోలీసులు తెలిపారు. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ లోని నలసోపారలో ఆ కుటుంబం ఉంటుంది. తండ్రి చిన్న బడ్డీకొట్టు నడుపుతున్నాడు. ఆమె మానసిక పరిస్థితి పై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఆ యువతి, ఆటో డ్రైవర్ మొదట వారి ఇంటికి 12 కిలోమీటర్ల దూరంలోని అర్నాలా బీచ్ కు వెళ్లారు. రాత్రి అక్కడే గడపాలనుకున్నారు. వారి వద్ద సరైన గుర్తింపు కార్డులు లేకపోవడంతో హోటల్ లో రూమ్ దొరకలేదు.దీంతో బీచ్ లోనే గడిపారు.

అక్కడే ఆటో డ్రైవర్ ఆమెను రేప్ చేసి పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం ఆమె రైల్వే స్టేషన్ ను చేరి, రాత్రి అంతా ఎక్కడో గడిపినందుకు, రేప్ జరిగినందుకు తండ్రి తనను కొడతాడన్న భయంతో సర్జికల్ బ్లేడ్, రాళ్లు మర్మావయంలో దింపుకుంది. విపరీతమైన రక్తస్రావం జరగడంతో, బాధ భరించలేక పోలీసుల సాయం తీసుకుంది. పోలీసులకు కూడా ఆమె మొదట తన వివరాలు చెప్పకుండా, తాను ఓ అనాధనని, కాశీలో తన అంకుల్ తో కలిసి ఉంటున్నానని, తాము ఇద్దరం కలిసి ముంబై వచ్చామని ఓ కట్టుకథ తెలిపింది. పోలీసులు గట్టిగా విచారించడంతో తల్లిదండ్రుల వివరాలు తెలిపింది. 2023 లో ఆమె ముంబైలని శివాజీ నగర్,నిర్మల్ నగర్ లో తనపై అత్యాచారం జరిగినట్లు రెండుసార్లు ఫోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తండ్రి పోలీసులకు తెలిపాడు. ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News