Friday, December 27, 2024

సాఫ్ట్ వేర్ యువతిపై అత్యాచార ఘటనలో ఆటోడ్రైవర్ అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగిన అత్యాచారం కేసును పోలీసులు చేధించారు. సీసీ కెమెరా విజువల్స్, ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా కేసును పోలీసులు నిందితుడు ఆటోడ్రైవర్‌ ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్‌ను లింగంపల్లి గోపీనగర్‌లో పోలీసులు పట్టుకున్నారు.

ప్రవీణ్‌ స్వగ్రామం నల్గొండ జిల్లా కేతిపల్లిగా గుర్తించారు. కాగా, సోమవారం రాత్రి ఆఫీస్ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రవీణ్ సాఫ్ట్ వేర్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించిన ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News