- Advertisement -
రామాయంపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆటో డ్రైవర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజాంపేట మండల కేంద్రంలో ఉదయం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…గ్రామానికి చెందిన తిరున హరి శ్రీరాములు(50)ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడని అతనికి ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేనందున మనస్థాపం చెంది ఇంట్లో దూలానికి ఉరివేసుకుని మరణించినట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవపంచనామ చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బిఆర్‌ఎస్ నాయకులు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సహకారంతో 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నాయకుల చేతుల మీదుగా మృతుడి కుటుంబానికి అందజేశారు.
- Advertisement -