Sunday, December 22, 2024

శంషాబాద్‌లో ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

auto driver committed suicide in shamshabad

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో మంగళవారం సెల్ఫీ ఆత్మహత్య కలకలం రేపింది. మండలంలోని చౌదరిగూడలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. మృతుడిని కుమ్మరి రవి (35)గా గుర్తించారు. మద్యానికి బానిస కావడంతో అతని భార్య వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన రవి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బాదితుడు ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం కోనసాగిస్తున్నాడు. తన ఆత్మహత్యకు తానే బాధ్యుడిని తెలుపుతూ సెల్ఫీ వీడియో తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News