Saturday, November 23, 2024

నమ్మించి, మోసగించి సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ కోఠి బస్టాండ్‌లో నిలబడిన ఒంటరి మహిళను గమ్యానికి తీసుకెళ్తానని చెప్పి దారి మళ్లించి మిత్రులను పిలిచి అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్  పోలీసుల అదుపులో

Dalit woman allegedly gang-raped in Rajasthan

మన తెలంగాణ/బాలాపూర్: ఆటోడ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వె ళ్తే.. జూబ్లీహిల్స్‌కు చెందిన మహిళ (35) తన వ్యక్తిగత పని నిమిత్తం గురువారం సాయం త్రం కోఠికి వచ్చింది. పని ముగించుకొని తి రిగి జూబ్లీహిల్స్ వెళ్లేందుకు కోఠి బస్టాప్ వద్ద ఎదురు చేస్తున్న మహిళ వద్దకు టిఎస్ 30టి 8677 నెంబరు గల ఆటోడ్రైవర్ వచ్చి ఎక్కడి కి వెళ్లాలని అడిగాడు. జూబ్లీహిల్స్ వెళ్లాలని మహిళ సమాధానం చెప్పడంతో తాను కూ డా జూబ్లీహిల్స్ వెళ్తున్నానని నమ్మబలికి ఆ టోలో ఎక్కించుకొని గుర్తు తెలియని ప్రాంతా ల్లో మహిళను తిప్పాడు.

ఈ క్రమంలో ఫోన్‌ద్వారా మరో ముగ్గురు యువకులను పిలిచి న ఆటోడ్రైవర్ వారిని సైతం ఆటోలో ఎక్కించుకున్నాడు. దీంతో అనుమానం కలిగిన మ హిళ తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ ఆ టో డ్రైవర్‌తో సహా ముగ్గురు యువకులను ప్రశ్నించినప్పటికీ యువకులు ఆమెను పట్టించుకోలేదు. అనంతరం మీర్‌పేట్ పొలీస్‌స్టేష న్ పరిధిలోని జిల్లెలగూడ గాయత్రినగర్‌లో గల రాయల్‌బార్ వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి మహిళను తీసుకువచ్చి ఆటోడ్రైవర్‌తో ముగ్గురు యువకులు మహిళ పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే అక్కడ నుంచి బయటపడిన మహిళ ఫోన్‌లో వారు సంభాషించుకుంటున్నారు. ఆటోడ్రైవర్ పేరు నిఖిల్, ముగ్గురు పేర్లు నితిన్, ప్రశాంత్, శ్రీనులుగా గ్రహించి పోలీసులకు మహిళ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆటోనెంబర్ ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News