Sunday, December 22, 2024

వజ్రాల హారం తిరిగి అప్పజెప్పిన ఆటో డ్రైవర్ నిజాయితీ

- Advertisement -
- Advertisement -

హర్యానా లోని గురుగ్రామ్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల ఆటోలో మరిచిపోయిన వజ్రాలతో కూడిన ఆభరణాన్ని ఆటో డ్రైవర్ నిజాయితీగా తిరిగి ఆమెకు అప్పజెప్పిన సంఘటన పలువురి ప్రశంసలు పొందింది. గురుగ్రామ్ కు చెందిన ఓ మహిళ ఇటీవల ఇల్లు మారారు. కొత్త ఇంటికి ఆటోలో తన స్నేహితురాలితో కలిసి వెళ్లారు. గమ్యస్థానానికి చేరగానే యూపిఐ ద్వారా డబ్బు చెల్లించి వెళ్లిపోయారు.

కానీ ఆటోలో తన బ్యాగ్ మరిచిపోయారు. ఆ బ్యాగ్‌లో డాక్యుమెంట్లు, క్రెడిట్ కార్డులతో సహా డైమండ్లు పొదిగిన బంగారు గొలుసు ఉన్నాయి. కాసేపటికి బ్యాగు గుర్తుకు వచ్చి ఆందోళనకు గురయ్యారు. యూపీఐ మెసేంజర్ ద్వారా ఆటో డ్రైవర్‌ను సంప్రదించడానికి ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీస్‌లను ఆశ్రయించారు. కొన్ని గంటల్లో ఆ ఆటోడ్రైవర్ వచ్చి అక్కడున్న మేనేజర్‌కు బ్యాగు అందజేసి వెళ్లిపోయాడు. చివరికి ఆ బ్యాగు ఆమెకు అందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News