తమ న్యాయమైన సమస్యైలను పరిష్కరించాలని కోరుతూ ఆటోడ్రైవలర్లు చలో ఆసెంబ్లీ కార్యక్రుమం నిర్వహించారు. తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘాల జెఎసి ఆధ్వర్యంలో ఎఐటియుసి రాష్ట కార్యాలయం హిమాయత్నగర్ నుండి చలో అసంబ్లీ కార్యక్రమం నిర్వయించగా పోలీసులు అడ్డుకొని ఆటో సంఘాల జాక్ కన్వీనర్ బి వెంకటేశం (ఎఐటియుసి), ఎ. సత్తిరెడ్డి (టిఎడిఎస్‌వి), మారయ్య (బిఆర్‌టియు), ఎంఎ సలీం (యూనిటీ తెలంగాణ), టియుసిఐ నాయకులు ప్రవీణ్, ఎఐటియువి నాయకులు ఎస్. అశోక్, జంగయ్య, కృష్ణమూర్తి, ఎం కృష్ణయ్య, ఎం. శ్రీను, నజీర్, ఎ. బిక్షపతి యాదవ్, ఎండి ఉమర్ ఖాన్ తదితర నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి లాలాగూడ, అంబర్పేట్ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆటో డ్రైవర్లకు రూ. 12 వేలు ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో మీటర్ చార్జీలు పెంచాలని, ఆటో డ్రైవర్లకు ఆటో పర్మిట్ లు ఇవ్వాలని, ఓలా ఉబర్ సంస్థలను రద్దుచేసి ప్రభుత్వమే ఒక యాప్ తయారు చేయాలనే ప్రదాన డిమాండ్‌లను పరిష్కరించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అనేక ఆందోళనను చేసినా ప్రభుత్వం పట్టిచుకోలేదు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.