- Advertisement -
హైదరాబాద్: ఆటో డ్రైవర్లకు రెండు లక్షల రూపాయల బీమా కల్పిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సొంత స్థలాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు ద్వారా రూ.45 లక్షల రుణాలను ఆటో డ్రైవర్లకు మంత్రి హరీష్ రావు ఇప్పించారు. సిద్దిపేట ఆటో క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆవిర్భావ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు ప్రధాన కేంద్రాల్లో ఐదు రూపాయలకే భోజనం సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆటో డ్రైవర్లకు అందేలా చూస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్‌ఎ రసమయి బాలకిషన్, ఎంఎల్‌సి ఫరూక్ హుస్సేన్ పాల్గొన్నారు.
- Advertisement -