Sunday, December 22, 2024

‘మహాలక్ష్మి పథకం’ వల్ల నష్టపోతున్నాం

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రభుత్వానికి రాష్ట్ర ఆటో డ్రైవర్ సంఘాల జేఏసి నాయకుల విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసి బస్సుల్లో మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత పథకాన్ని స్వాగతిస్తున్నట్లు రాష్ట్ర ఆటో డ్రైవర్ సంఘాల జేఏసి నాయకులు తెలిపారు. అయితే ఈ పథకం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని ఏఐటియూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసి నాయకులు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆటో మీటర్ల చార్జీలు పెంచారని పదేళ్లుగా ఉన్న ప్రభుత్వం తమను పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఉన్న 7 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాయని వారు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో మాదిరిగా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు స్వయం ఉపాధి పథకాలు అందించాలని వారు కోరారు. తమ సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయాన్ని కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News