Monday, December 23, 2024

ఆటో డ్రైవర్లకు జీవనభృతి ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

నెలకు రూ.15వేలు ఇచ్చి ఆదుకోవాలి
సిద్దిపేటలో ఎంఎల్‌ఎ హరీశ్‌రావు

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హ రీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేట్ సోసైటీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్‌కు నిర్వహించిన అటల పోటీలను ప్రారంభించి మాట్లాడారు. డ్రైవర్లకు నెలకు రూ. 15వేల జీవనభృతి ఇ వ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్రైవర్ల సమస్యలపై అ సెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో అటల పోటీలు నిర్వహించడం రాష్ట్రానికి ఆదర్శమన్నారు. 1480 మంది ఆటో డ్రైవర్లు ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. సిద్దిపేటకు వారు బ్రాండ్ అంబాసిడర్లు.పట్టణానికి వచ్చే అతిథులను గౌరవమర్యాదలతో గమ్యాలకు చేరుస్తున్నారని తెలిపా రు. డ్రైవర్లు ఉపాధి  కోల్పోయారు. రాష్ట్రంలోని 6 లక్షల మంది డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు.

మహిళలకు ఫ్రీ బస్ మంచి కార్యక్రమం, ఒకరికి మంచి చేయడానికి, ఇంకొకరి కడుపు కొట్టవద్దన్నారు. ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని తెలిపారు.ఆటో డ్రైవర్స్ నిత్యం బిజీ ఉంటు వారు ఆరోగ్యంపైదృష్టి పెట్టడం లేదన్నారు. వారి మానసికొల్లాసం కొరకు ఈ ఆటలు ఎంతోదోహద పడతాయన్నారు. మీ పిల్లల చదువు లు, మీ ఆరోగ్యం కు నేను ఆండగా ఉంటానన్నారు. మీరు మంచి అలవాట్లు ఆలవర్చు కోవడం మంచి పరిణామమన్నారు. సిద్దిపేట స్పోర్ట్ హబ్ గా మారిందని, అన్ని ఆటలు మన సిద్దిపేట లో ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News