Friday, November 22, 2024

డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోబంద్

- Advertisement -
- Advertisement -

గత 11ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్ర భుత్వ వైఖరిని నిరసిస్తూ డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్త ఆటోబంద్ నిర్వహిస్తున్న ట్లు తెలంగాణ ఆటోడ్రైవర్స్ యూనియన్స్ జెఏసి కన్వీనర్ బి.వెంకటేశం తెలిపారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆ టోడ్రైవర్ల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ జెఏసి సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స మయంలో మానిపెస్టోలో ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకుం డా కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు.10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుండా మో సం చేసిందని విమర్శించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గ డుస్తున్నప్పటికి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం భాదకరమన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం లెక్కలేనన్ని ధర్నాలు,ర్యాలీలు,వినతిపత్రా లు అందజేసిన గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నదని ధ్వజమెత్తారు. ఆటోడ్రైవర్ల సమస్య ల పరిష్కారంలో నిర్లక్షం వహిస్తే గత బిఆర్‌ఎస్‌కు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని ఆయన హెచ్చరించారు. జెఏసి నేతలు పి.శ్రీకాంత్, వి.ప్రవీణ్,ఎంఎ సలీమ్,ఎ.సత్తిరెడ్డి, వి.మారయ్య, ఏఐటియుసి నాయకులు వి.ఎస్ బోస్, బిఆర్‌టియు అధ్యక్షుడు రాంబాబుయాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News