Monday, January 27, 2025

డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్

- Advertisement -
- Advertisement -

వచ్చేనెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్‌కు పిలుపునిచ్చామని పేర్కొంటూ రాష్ట్ర ఆటోడ్రైవర్స్ యూనియన్ జేఏసి నాయకులు ఆర్టీఏ జాయింట్ కబిషనర్‌కు సమ్మె నోటీసును సోమవారం అందజేశారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆటోబంద్‌ను నిర్వహిస్తున్నామని జేఏసి నేతలు బి.వెంకటేశం, ఎస్.అశోక్ (ఎఐటియూసి), ఎంఎ.సలీం (యుటిఎడిడబ్ల్యూఎ), ఎ.సత్తిరెడ్డి (టిఎడిఎస్) తదితరులు సమ్మె నోటీసు అందజేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలతో పాటు రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు

చేయాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు అనుగుణంగా ఆటోమీటర్ చార్జీలు పెంచాలని, మహాలక్ష్మి పథకం వల్ల ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20వేల కొత్త ఆటో పర్మిట్లు ఇవ్వాలని, ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెల్లించాలని, యాక్సిడెంట్ బీమాను రూ.10లక్షలకు పెంచాలని అలాగే కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయం అందజేయాలని వారు డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News