Friday, December 27, 2024

పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

మెదక్: రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని బీఆర్‌ఎస్ క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆద్వర్యంలో ఆటో, ఎలక్ట్రిసిటీ, ప్లంబర్ సభ్యులతోపాటు రజక సంఘ సభ్యులు సుమారు 300 మంది ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి మద్దతుగా ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని 60,70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు పాలించిన ఎలాంటి అభివృద్ది చేయలేకపోయారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక అభివృద్ది ఒకవైపుసంక్షేమం ఒకవైపు దూసుకుపోతుందని కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా పోయారని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 24 గంటల ఉచిత విద్యుత్‌తో ఇంటింటికి నల్ల నీరు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు తేవడం జరిగిందని రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని రైతు భీమా, రైతుబందు పథకాలు పథకాలు చేపట్టడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, పుట్టి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, చిలుక గంగాధర్, కోఆప్షన్ సభ్యులు పృథ్విరాజ్‌గౌడ్, అహ్మద్, ప్రభావతి, రామాయంపేట రెవెన్యూ చుట్టు పక్కల గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News