Monday, April 14, 2025

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలం ధనపురం క్రాస్‌ వద్ద హైవేపై ఆదివారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాాణాలు కోల్పోగా ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురూ మహిళలేనని పోలీసులు తెలిపారు. బాధితులంతా కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News