Friday, December 27, 2024

సజ్జనార్ కారును ఢీకొట్టిన ఆటో… ఆర్టీసీ ఎండీకి గాయాలు

- Advertisement -
- Advertisement -

Auto hit RTC MD Sajjanar car At Peddapalli

పెద్దపల్లి: టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కారును ఆటో ఢీకొనడంతో తృటిలో ప్రమాదం తప్పిన సంఘటన పెద్దపల్లి ధర్మారం సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎండి సజ్జనార్ చేతికి స్వల్ప గాయాలయ్యాయని, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు గాయపడ్డారని సమాచారం. మహారాష్ట్రకు వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న ఓ ఆటో డ్రైవర్‌ వాహనం అదుపు తప్పి ఎండీ సజ్జనార్‌ కారును ఢీకొట్టాడు. ప్రథమ చికిత్స అనంతరం సజ్జనార్ తన ప్రయాణాన్ని కొనసాగించారు. గాయపడిన ప్రయాణికులను పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News