Sunday, December 22, 2024

స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ…

- Advertisement -
- Advertisement -

అమరావతి: స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించారు. శరత్ థియేటర్ సమీపంలో ఆటోను లారీ ఢీకొట్టడంతో పల్టీలు కొట్టడంతో పిల్లలు ఆర్తనాదాలు చేశారు. రక్తం కారుతూ ఉండడంతో ఏడుస్తూ కనిపించారు. ఆటో మాత్రం నుజ్జు నుజ్జుగా మారింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించడంతో స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గాయపడిన పిల్లలను చూసుకొని తల్లిదండ్రులు కన్నీంటి పర్యంతమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News