Thursday, January 23, 2025

అదుపుతప్పి ఆటో బోల్తా : ఇద్దరి మృతి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: అదుపుతప్పి ఆటో బోల్తా పడిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం శివారులో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. కొండమల్లేపల్లి నుండి అజ్మాపురం వైపు వస్తున్న ఆటో అజ్మాపురం గ్రామ సమీపంలోకి రాగానే రోడ్డుపై ఉన్న మట్టి దిబ్బెను ఎక్కడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

ఆటో ఉన్న ప్రయాణికులు కొట్టాలగడ్డ తండాకు చెందిన జటావత్ గాస్య(60), అజ్మాపురం గ్రామానికి చెందిన మంగిలిపల్లి మంగమ్మ(55) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉండగా మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన గాస్య పడమటిండా వద్ద కిరాణం దుకాణం నిర్వహిస్తున్నాడు. మంగమ్మ భర్త గత అయిదు సంవత్సరాల క్రితమే మృతి చెందాడు. ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు.

విషయం తెలిసిన వెంటనే సంఘటనాస్థలాన్ని సిఐ శ్రీనివాసు, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి చేరుకొని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News