Monday, December 23, 2024

రోడ్డుపై ఆటోల ‘రేసింగ్’

- Advertisement -
- Advertisement -

Auto racing in Chandrayan gutta

 

చాంద్రాయణగుట్ట: రేసింగ్ విష సంస్కృతి పాతబస్తీకి పాకింది. రాత్రివేళ కొందరు ఆటోడ్రైవర్లు తమ ఆటోలతో ప్రధాన రోడ్లపై వాహనచక్రాలను గాల్లోకి లేపి వికృత విన్యాసాలు చేస్తున్నారు. తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఖరీదైన బైకులు, కార్లతో సంపన్న ప్రాంతాలు, బాహ్యవలయ రహదారులకే పరిమితమైన రేసింగ్ పాత నగరానికి వ్యాప్తి చెందటం పట్ల సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వివరాలలోకి వెళితే… కొంతమంది ఆటోడ్రైవర్లు మత్తుపదార్థాలు సేవించి ఆ మత్తులో తమ ఆటోలతో రేసింగ్ పెట్టుకుంటున్నారు. రాత్రివేళ చాంద్రాయణగుట్ట డీఎల్‌ఆర్‌ఎల్ నుంచి హఫీజ్‌బాబానగర్, డీఆర్‌డీఓ, ఓవైసీ కూడలి, సంతోష్‌నగర్‌వైపు, తిరిగి ఆదే మార్గంలో ఆటోలతో రేసింగ్‌లకు దిగుతున్నా రు.

వరుసగా తమ ఆటోల వెనుక చక్రాన్ని గాలిలోకి లేపి రెండు చక్రాలపై వేగంగా వెళుతున్నారు. ఆ సమయంలో ఆటో ఎక్కడ బ్యాలెన్స్ తప్పి ప్ర మాదం ముంచుకు వస్తుందోనన్న భయం వారిలో కనిపించటం లేదు. పైగా అరుపులు కేకలు వేస్తూ నానా బీభత్సం సృష్టిస్తున్నారు. ఆటోల వేగం పెం చుతూ శృతిమించి విన్యాసాలు చేస్తూ వాహనదారులను భయ పెడు త న్నా రు. తమ పైశాచిక ఆనందానికి ఎవరు బలియవుతారోనన్న భయం వారిలో ఏ కోషాన కనిపించటం లేదు. వీరి వికృత విన్యాసాలు చూ సిన తోటి వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు బిగబట్టుకొని వాహనాలు నడుపుతున్నారు. గురువారం రాత్రి ఎప్పటి మాదిరిగానే ఆటోలతో వి న్యాసాలు చేస్తున్న ఆరుగురు వ్యక్తులను ఫలక్‌నుమా ఏ సీపీ మహ్మద్ మజీద్ ఆధ్వర్యంలో చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ జరిగిన సంగతి …

చాంద్రాయణగుట్ట పెట్రోకార్, సెక్టార్ ఒకటిలో విధులు నిర్వహించే కానిస్టేబుల్ హెచ్.ప్రసాద్‌రావు (9413) గురువారం అర్ధరాత్రి ఉమర్ హోటల్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా మూడు ఆటోలు నిర్లక్షంగా నడుపుతున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారు. వికృత చేష్టలతో విన్యాసాలు చేస్తూ కంచన్‌బాగ్ డీఆర్‌డీఎల్ వైపు నుంచి చాంద్రాయణగుట్ట రావటం గమనించాడు. ఇది గమనించి పెట్రోకారు సిబ్బంది వా రిని వెంబడించటంతో మైలార్‌దేవుపల్లి వైపు పారిపోయారు. పోలీసులు ఒక ఆటో (టీఎస్ 34టీఎ 0238)పై ‘ముబారక్ రిస్తే’ అని రాసి ఉన్న ప్రకటన బోర్డును గమనించారు. విధులు ముగించుకొని స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆటో నెంబర్, ప్రకటన బోర్డు ఆధారంగా పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

వీరిలో టోలిచౌకికి చెందిన ఆటోడ్రైవర్ సయ్యద్ జబేర్ అలీ (20) నడిపిన టీఎస్ 13యుబి 2894, ఆటోడ్రైవర్ సయ్యద్ సాహిల్ (21) నడిపన ఆటో టీఎస్ 34టిఎ 0238, డీసిఎం డ్రైవర్ ముహమ్మద్ ఇబ్రహీం (22) నడిపిన ఆటో టీఎస్ 15యుడి 2068 (పరారీలో ఉన్నాడు), ఆటోడ్రైవర్ ముహమ్మద్ ఇనాయత్ (23), గోల్కొండకు చెందిన ప్రైవేటు ఉద్యోగి గులామ్ సైఫ్ ఉద్దీన్ (23), టోలిచౌకికి చెందిన ఆటోడ్రైవర్ ముహమ్మద్ సమీర్ (19), దినసరి కూలి ఆమెర్ ఖాన్‌లుగా గుర్తించారు. వీరందరు ఆ టోను అద్దెకు తీసుకొని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి వచ్చి ఆటోలతో స్టంట్స్ చేస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తుంటారు. స్వీయ భద్రత, తోటి ప్రయాణికులకు ప్రమాదకరమని తెలిసి వికృత విన్యాసాలు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. వీరి వద్ద నుండి రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా టీఎస్ 13యుబి 2894 ఆటోపై రూ.5410 ఛాలాన్, టీఎస్ 34టిఎ 0238 ఆటో పై రూ. 5380 ఛాలాన్, టీఎస్ 15యుడి 2068 ఆటోపై రూ. 3810 చలాన్ పెండింగ్‌లో ఉన్నట్లు గమనించారు. కేసును ఫలక్‌నుమా ఏసీపీ మ హ్మద్ మజీద్ ఆధ్వర్యంలో చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ అదనపు ఇన్‌స్పెక్టర్ మధుసూదన్‌రెడ్డి, ఎస్సైలు గోవర్ధన్‌రెడ్డి, గౌస్‌ఖాన్, సిబ్బంది ఛేదించా రు. ఐపీసీ, టీఎస్‌ఎంవిఆర్, మోటార్ వెహికిల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News