Thursday, April 3, 2025

సూర్యాపేటలో ప్రమాదం.. కాలువలోకి దూసుకెళ్లిన ఆటో..

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: జిల్లాలోని మునగాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి బరాఖత్‌గూడెం వద్ద ఓ ఆటో ప్రమాదవశాత్తు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆటో తుమ్మలపల్లి నుంచి కోదాడ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News