Monday, December 23, 2024

ఆటో రాముడు… డ్రామాలు మానడు!

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీపై సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ విమర్శలు

మనతెలంగాణ/హైదరాబాద్:  ‘ఆటో రాముడు… డ్రామాలు మానడు..’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా బిఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది. మహిళా సాధికారత కోసం, పెరిగిన ధరల నుంచి ఉపశమనం కలిగించడం కోసం, నష్టాల్లో ఉన్న ఆర్టీసిని కాపాడడం కోసం కాంగ్రెస్ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించినట్లు పేర్కొంటోంది.

కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్ల సమస్యలను ముందుగానే గుర్తించి సంవత్సరానికి 12 వేల రూపాయలను అందిస్తామని, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు గుర్తుచేసింది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపింది. దీనికి సరైన సూచనలు అందించాల్సిన ప్రతిపక్షం, మహిళలను కించపరిచేలా ప్రచారం చేస్తూ, ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఉపాధినిచ్చే ఆటోలను కాల్చేయమని ప్రోత్సహిస్తూ వారి చావుకు కారణం అవుతుందని ఆరోపించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News