Wednesday, January 22, 2025

త్వరలో మరిన్ని బిసి పథకాలకు శ్రీకారం

- Advertisement -
- Advertisement -

ఎంబిసిలకు 60% సబ్సిడీతో ఇ-ఆటోరిక్షాలను పంపిణీ చేసిన మంత్రి గంగుల
పోటీ పరీక్షలకు ఎంబిసి విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సులు : బుర్రా వెంకటేశం

Auto rickshaw for MBC Candidate

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందనిరాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం సంక్షేమభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంబిసిల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఇ-ఆటో రిక్షా పథకంలో 60 శాతం రాయితీతో రూ. 23 లక్షల వ్యయంతో 12మంది లబ్ధిదారులకు ఆటోలు పొందిన లబ్ధిదారులకు మంత్రి తాళాలు అందజేశారు. అనంతరం జెండా ఊపి ప్రారంభించి.. ఇ-ఆటోని మంత్రి గంగుల నడిపి పరీక్షించారు, ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంబిసి కులాలను గుర్తించక పోవడంతో ఉపాధి అవకాశాలు కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. మనం వెనకబడిన వారం కాదని వెనుకకు నెట్టేయబడ్డ వాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 500 కోట్ల విలువ చేసే పదెకరాల భూమిని ఎంబిసిలకు కేటాయించామన్నారు. కరో నా ఇబ్బందులతో కార్యక్రమాలు ఆలస్యం అయిందన్నారు. బిసి, ఎంబిసిలకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రాబొయే రోజుల్లో నిర్వహిస్తుందన్నారు. ఇఆటోల యూనిట్‌కు రూ.3,22,910 ఉందని.. ఇందులో ప్రభుత్వం రాయితీ కింద రూ.1,93, 746 అందించిందని, లబ్దిదారుల వాటాగా రూ.15 వేలు, బ్యాంకు రుణం కింద రూ. 1,14,164 ఉందన్నారు, ఈ ఆటోల కోసం దాదాపు 500 మంది దరఖాస్తు చేసుకోగా.. 300 మంది ముందుకు వచ్చారని తెలిపారు. ప్రసుత్తం 36 మందికి ఆటోలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని, 12 మందికి ఈ రోజు అందజేశామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ సిఎం కెసిఆర్, మంత్రి కమలాకర్ చొరవతో ఎంబిసిలకు నవశకం, నవయుగం ప్రారంభమైందన్నారు. 2022 కొలువుల సంవత్సరం అని, ఎంబిసిలు కనీసం ఐదారువేలకు పైగా ఉద్యోగాలు సాధించాలన్నారు, అందుకోసం ఫౌండేషన్ కోర్సులు నిర్వహిస్తున్నామని, ఎంబిసిల్లో చదువుకుంటున్న వారి జాబితా తీసుకుంటున్నామని వారందరిన్ని పోటీ పరీక్షలకు సిద్దం చేస్తామని, స్వయం ఉపాది కావాలనుకునే వారికి ఉపాధి మార్గాలు చూపెడతామన్నారు, బిసి హాస్టళ్లలో ఎక్కడ సీట్లు ఖాళీ ఉన్నా ఎంబిసిలకు ప్రథమ ప్రాధాన్యంగా కేటాయిస్తామన్నారు. ఇఅటోలు పొందిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. పథకం లబ్ధిదారులకు సౌలభ్యంగా ఉండేలా నెలకు రూ. 2 వేల ఈఎంఐ మాత్రమే నిర్ణయించామని బ్యాంకు అధికారుల వెల్లడించారు. కార్యక్రమంలో ఎంబిసి కార్పొరేషన్ సిఈఓ మల్లయ్యభట్టు, వడ్డెర ఫెడరేషన్ ఎండీ బాలాచారి, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ ఎండి విమలాదేవి, ఎస్బీఐ ఏజీఎం శ్రీనాథ్, మహీంద్రా సంస్థ ప్రతినిధి నాగేశ్వర్ రావు, ఎంబీసీ సంఘాల నేతలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News