Monday, December 23, 2024

కేబుల్ బ్రిడ్జిపై ఆటో బోల్తా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేబుల్ బ్రిడ్జిపై ఆటో బోల్తా పడింది. బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ నుంచి ఐటిసి కొహినూర్ వైపు వస్తున్న ఆటో అకస్మాత్తుగా బోల్తా పడింది. డ్రైవర్ సెల్‌ఫోన్ చూస్తూ ఆటో నడపడంతో ఎదురుగా వున్న ద్విచక్ర వాహనాన్ని గమనించకపోవడంతో ఆటోను ఒక్కసారిగా కుడి వైపునకు తిప్పడంతో బోల్తా పడింది. వెనుక నుంచి వచ్చి కారు చాకచక్యంగా పక్కకు తిప్పడంతో ప్రమాదం తప్పింది.

Also Read: 5089 ఉపాధ్యాయ, 1523 ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News