నల్గొండ : ఆటోల దొంగను అరెస్టు చేసి నిందితుడి వద్ద నుండి ఆరు లక్షల విలువగల ఆరు ఆటోలను స్వాధీన పరుచుకొని రి మాండ్‌కు తరలించినట్లు నల్గొండ డిఎస్పి నరసింహారెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నల్లగొండ పట్టణములో గత కొద్ది రో జులుగా ఆటోలు దొంగతనం జరుగుతున్న తరుణంలో గత నెల 22 న నల్లగొండ పట్టణానికి చెందిన రఫీక్ ఆహ్మద్‌మీర్ బాగ్ కాలని లో పార్కింగ్ చేయగ దొంగతను జరిగిందని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు పై విచారణలో భాగంగా శనివారం హైద్రాబాద్ లోని గపూరియా మజీద్ దగ్గర, బొంగుఖర్ఖానా, వొట్లపల్లి, పలక్నామా లో నేరస్తులు ఉన్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఎస్‌ఐ సురభి సంపత్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లారు. నేరస్తుడైన మహ్మద్ సలీంను అదుపులోకి తీసుకొని విచారించా రు. విచారణలో అతని స్వంత అల్లుడు సయ్యద్ సమీర్‌తో కలిసి 8 ఆటోలు దొంగతనం చేశామని ఒప్పుకున్నారు. జనవరి 2023లో అనంతపురంలో ఒక ఆటో , ఏప్రిల్‌లో మహబూబ్ నగర్‌లోని భూ త్పూర్ ఒక ఆటో, ఏప్రిల్ లో జహీరాబాద్లోని ఒక ఆటో, జూన్‌లో మహబూబ్ నగర్‌లో ఒక ఆటో దొంగతనం చేశారని తెలిపారు. గత నెల 22న నల్లగొండకు వచ్చి రాత్రి సమయంలో వీదులలో తిరుగుతూ హైదరాబాద్ రోడ్డులో మీరటాగ్ కాలనీలో ఇంటి ముందు ఒక ఆటో దొంగతనం చేశారు.
26న నల్లగొండకు వచ్చి మిర్యాలగూడ రోడ్డులో లక్కీ వైన్స్ ముందు ఒక ఆటో పార్క్ చేసి వుండగా దొంగతనం చేశారు. జూన్ లో విజయవాడలో ఒక ఆటో, జులైలో హైద్రాబాద్ లోని అత్తాపూర్‌లో ఆటోను దొంగిలించారు. దొంగిలించిన ఎనిమిది ఆటోలలో6 ఆటోలు మహ్మద్ సలీం వద్ద నుండి స్వాధీనం తీసుకోవడం జరిగిందన్నారు. మిగిలిన 2 ఆటోలతో, నేరస్తుడు సయ్యద్ సమీర్ పరారీలో ’ఉన్నాడు.ఇట్టి కేసును డీఎస్పీ సూచన మేరకు, టూ టౌన్ సిఐ నాగ దుర్గ ప్రసాద్, ఎస్ హెచ్ ఓ నాగరాజు, పర్యవేక్షణలో జరిగిందని. ఈ ప్రెస్ మీ ట్‌లో ఎస్‌ఐ సంపత్,ఎస్త్స్ర సైదులు, పాల్గొన్నారు. ఈ సందర్భ ంగా సి బ్బ ంది మహమ్మద్ శంశోద్దీన్, యస్. శంకర్, బాలకోటి, లను డీఎస్పీ అభినందించారు.