ఖమ్మం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 714 జీ.ఓ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన సందర్భంగా దానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో టీఆర్ఎస్కేవీ-టిఏటియూ ఆటో యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్కేవీ – టిఏటియూ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య, జిల్లా అధ్యక్షులు పాల్వంచ కృష్ణ మాట్లాడుతూ… కార్మికుల పక్షాన తెరాస ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటూ కార్మికుల బాగోగులు కోరుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి ఆటో కార్మికులు రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ జిల్లా నాయకులు యమ్.డి.వై.పాషా , టిఏటియూ నగర అధ్యక్షుడు వేమ సెల్వరాజు, ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ గుప్తా , నగర కోశాధికారి ఎస్.కే. జానీ మియా, నగర కమిటీ సభ్యులు, టిఏటియూ నగర సోషల్ మీడియా సభ్యులు, వివిధ అడ్డ అధ్యక్షులు, అడ్డా కమిటీ సభ్యులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
మంత్రి పువ్వాడను కలిసిన ఆటో యూనియన్ నాయకులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -