Monday, January 20, 2025

మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి ఇంట్లో బంధించిన సైకో..

- Advertisement -
- Advertisement -

 

ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఆడపిల్లలపై దాడులు ఆగడం లేదు. కామాంధుల కామానికి ఆడవారు బలవుతున్నారు. అధికారులు ఎన్ని కఠినచర్యలు తీసుకుంటున్నా ఆడవారిపై దాడులు మాత్రం ఆడ్డుకట్టపడటంలేదు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు పశువుల్లా వారిపై పై దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనను తలపించేలా  ఓ సంఘటన గురువారం రాత్రి భువనగిరి రూరల్ పోలీస్టేషన్‌ పరిధిలోని బిఎన్ తిమ్మాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి రోజంతా ఇంట్లో బందించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచళనంగా మారింది.
భువనగిరి మండల పరిధిలోని బిఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన 9వ,10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు తన ఇంటి నుంచి పాఠశాలకు బయలు దేరింది. పాఠశాల గదిలో బ్యాగ్ పెట్టుకుని విశ్రాంతి సమయంలో బయట ఆడుకునేందుకు వచ్చిన ఇద్దరు అమ్మాయిలను అదే గ్రామానికి చెందిన మేడబోయిన యుకేశ్, ఇద్దరు మైనర్ బాలికలను మాయమాటలు చెప్పి, ఇదే సమయం అన్ని భావించి ఆబాలికలను కిడ్నిప్‌ చేసి గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోకి తీసుకువెళ్లి దాచి పెట్టాడు.

బయటకు ఎక్కడికో తీసుకుపోదామనే ఆలోచనతో యువకుడు ఎవరికి తెలియకుండా ఇంట్లోనే ఉంచి రాత్రి వేళలో అమ్మయిలను బయటికి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్కూలుకు వెళ్లిన అమ్మాయిలు తిరిగి ఇంటికి రాకపోవడంతో అమ్మాయిల బంధువులు భయభ్రాంతులకు గురై గ్రామంలో అంతా వెతికారు. విద్యార్థులు యాకేశ్ ఇంటికి వెళ్లినట్లు తెలుసుకున్న కుటుంబసభ్యులు తాళం వేసి ఉన్న ఇంటి వెనకకు వెళ్లి చూడగా లోపలి నుంచి గడియా పెట్టి ఉందని గుర్తించారు. ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళగా ఇద్దరు బాలికలు అక్కడే ఉండడానికి గమనించి యువకుడి ఇంటిపై గ్రామస్తులు దాడి చేశారు.

2బైక్ లు దగ్దం చేశారు. అమ్మాయిల బంధువులు ఆవేశం, అగ్రహానికి గురై యకేష్ కు చెందిన మోటర్ సైకిల్ కు నిప్పు అంటించి దగ్ధం చేశారు. గ్రామస్తుల సమాచారంతో భువనగిరి రూరల్ ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరించి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ బెటాలియన్ పూర్తి బందోబస్తు నిర్వహించారు. బాధితుడు మేడ పోయిన యాకేష్ ను అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇద్దరు విద్యార్థులను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి మహిళా పోలీసులతో విచారణ చేపడుతున్నట్లు భువనగిరి రూరల్ సీఐ వెంకటేశం పేర్కొన్నారు . విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు యాకేశ్ పై ఫోక్సో, ఇతర కేసులు నమోదు చేస్తామని రూరల్ ఎస్ఐ హెచ్ రాఘవేందర్ గౌడ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News