Wednesday, January 22, 2025

తిరుమలలో అటోమెటిక్ లడ్డూ తయారీ యంత్రాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తిరుమలలో లడ్డూల తయారీ ప్రక్రియ వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి అటోమెటిక్ లడ్డూ తయారీ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని టిటిడి ఈవో ఎ.వి. ధర్మారెడ్డి తెలిపారు. అలాగే ప్రపంచంలోనే నెంబర్ ఒన్ స్థాయిలో రూపొందిస్తున్న తిరుమల మ్యూజియంను కూడా డిసెంబర్ నాటికి సిద్దం చేస్తామని ఆయన చెప్పారు. శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేశామన్నారు. బంగారు తాపడం పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేలా గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తామని చెప్పారు.

అలాగే గోవిందరాజు స్వామి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులు స్థానిక కాంట్రాక్టర్లు నిర్దేశిత గడువులో పూర్తి చేయకపోవడంతో ఆలస్యమవుతుందని చెప్పారు. శుక్రవారం డయల్ యువర్ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మారెడ్డి భక్తులతో మాట్లాడారు.. కొత్తగా నిర్మించిన పరకామణి భవనంలో ఈనెల 5 నుంచి కానుకల లెక్కింపు ప్రారంభం కానుందని తెలిపారు.

బెంగళూరుకు చెందిన మురళీకృష్ణ అనే దాత అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాత సౌకర్యాలతో ఈ పరకాణి భవనాన్ని నిర్మించామన్నారు. భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగత్మకంగా టిటిడి దేవస్థానమ్స్ పేరుతో మొబైల్ యాప్‌ను ప్రారంభించామన్నారు. వేంకటేశ్వర స్వామి భక్తి ఛానల్‌లో ప్రసారమవుతోన్న గరుడపురాణం కార్యక్రమం పట్ల భక్తుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. యువతకు ధార్మిక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఈనెల 5, 6వ తేదీల్లో తిరుమల ఆస్థానమండపంలో యువ ధార్మికోత్సవం నిర్వహిస్తామన్నారు.

దీనిలో దాదాపు రెండు వేల మంది యువతీయువకులు పాల్గొంటారన్నారు. ఈనెల 5న రామకృష్ణ తీర్ధ ముక్కోటి, మాఘపౌర్ణమి గరుడు సేవ ఉంటుందన్నారు. అలాగే ఈనెల 18న గోగర్భ తీర్ధంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈనెల 11 నుంచి 19వరకు శ్రీనివాసమంగాపురంలో కళ్యాణ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు, అలాగే ఈనెల 11 నుంచి 20 వరకు తిరుమతిలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తామని ఇవో ధర్మారెడ్డి వెల్లడించారు.

ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు తొండమనాడులోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో, ఈనెల 28 నుంచి మార్చి 8వ తేదీ వరకు తరిగొండలోని శ్రీలక్ష్మినరసింహా స్వామి ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. జనవరి నెలలో 20క్షల మందిని శ్రీవారిని దర్శించకోగా, హుండీ ద్వారా రూ.13.07 కోట్లు ఆదాయం వచ్చిందని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. లడ్డూల విక్రయాల ద్వారా రూ.1.07 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. మొత్తం 7.51 లక్షల మంది తలనీలాలు సమర్పించగా, 37.38 లక్షల మంది అన్నప్రసాదాలను స్వీకరించారని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News