Friday, December 20, 2024

లైన్‌లో నిలబడాల్సిన బాధ లేదు !

- Advertisement -
- Advertisement -

Automatic Ticket Vending Machine: Railways

ఆటోమెటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్ల ద్వారా రైల్ టికెట్‌ల కొనుగోళ్లు
అధునాతన యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే శాఖ
సికింద్రాబాద్‌తో పాటు ప్రధాన స్టేషన్‌లలో...

హైదరాబాద్: లైన్‌లో నిలబడి రైలు టికెట్‌లు కొనుక్కునే బాధను తప్పిస్తూ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యమైన స్టేషన్‌లలో ప్రయాణికుల క్యూ భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కౌంటర్ల వద్ద టికెట్‌లు ఇచ్చే వారు సైతం ఇబ్బందులు పడుతుంటారు. వీటికి చెక్ పెట్టడానికి ఎటివిఎమ్స్ (ఆటోమెటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్ల)ను ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లలో రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఈ యంత్రాలను దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్‌తో పాటు ప్రధాన స్టేషన్‌లలో ముందస్తుగా ఏర్పాటు చేసింది. రైలులో ప్రయాణించే వారు సులువుగా టికెట్లను పొందేందుకు ఎటివిఎమ్స్ (ఆటోమెటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్ల) రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ మధ్యే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం ఈ కొత్త సర్వీసును ద.మ. రైల్వే ప్రారంభించింది. ప్రయాణికులు తాము ఎక్కే స్టేషన్ నుంచి దిగే స్టేషన్ వివరాలను అందులో పొందుపరిస్తే రైలు టిక్కెట్లు సులువుగా పొందవచ్చని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మిషన్‌తో ప్రయాణికులకు టికెట్‌ల కొనుగోళ్లు సులువు కావడంతో పాటు స్వయంగా రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకునే నదుపాయం కలిగిందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయితే ఎటివిఎమ్స్ యంత్రాల్లో దక్షిణ మధ్య రైల్వే క్యూ ఆర్ కోడ్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకురావడంతో టికెట్‌ల బుకింగ్ మరింత ఈజీ అయ్యిందని అధికారులు పేర్కొంటున్నారు.

స్మార్ట్ కార్డు రీ ఛార్జీ చేసుకునే
రైలులో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఎటివిఎం స్క్రీన్‌లో ఎక్కడికి వెళ్లాలో ముందుగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్రైన్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్ ఆటో సెలెక్ట్ అవుతోంది. అనంతరం యుపిఐ క్యూ ఆర్ కోడ్ ఆప్షన్ వినియోగించుకొని వినియోగదారులు టికెట్‌ను బుక్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ముఖ్యంగా స్క్రీన్‌పై డిస్‌ప్లే అయిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేసుకునే వీలు ఉంటుంది. ఈ యంత్రం ద్వారా ప్రయాణికులు ఫిజికల్‌గా టిక్కెట్ తీసుకోవడంతో పాటు స్మార్ట్ కార్డు రీ ఛార్జీ చేసుకునే అవకాశం ఉంటుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. దానికి కూడా నామమాత్రపు ధరను నిర్ణయించినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

క్యాష్‌లెస్ పేమెంట్‌లను ప్రోత్సహించేలా….
ఆటోమెటిక్ వెండింగ్ మెషిన్స్‌లో టిక్కెట్ తీసుకునే ప్రయాణికులు క్యాష్ లెస్ పేమెంట్‌లను ప్రోత్సహించేలా భారతీయ రైల్వే క్యూ ఆర్ కోడ్ పేమెంట్ ఆప్షన్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలా ఏ రకంగా చూసినా ప్రయాణికులు తమ స్మార్ట్ ఫోన్ నుంచి సులభంగా నగదు చెల్లంపులను చేసి టిక్కెట్‌లను బుక్ చేసుకునే అవకాశాన్ని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్‌లోని ఈ మెషిన్లు ద్వారా అవకాశం కల్పించినట్టు రైల్వే శాఖ తెలిపింది. ఈ టిక్కెట్ మెషిన్లు ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలోనే కాకుండా దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ యంత్రాలను రైల్వే శాఖ అందుబాటులో తీసుకొచ్చింది. గతంలో రైలు టిక్కెట్ తీసుకోవడానికి ప్రయాణికులు రైల్వే టిక్కెట్ కౌంటర్ల దగ్గర క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఈ యంత్రాలతో పాటు స్మార్ట్ కార్డులను అన్ని రైల్వే స్టేషన్‌లలోని టిక్కెట్ కౌంటర్లలో రైల్వే శాఖ అందుబాటులో ఉంచింది.

బెర్త్ విషయంలో తల్లిదండ్రులదే తుది నిర్ణయం…
రైలులో ప్రయాణించే చిన్న పిల్లలకు టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించిన నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టిక్కెట్, బెర్త్‌లను కొనుగోళ్లను వారి ఇష్టానికే వదిలేస్తున్నామని రైల్వే శాఖ తెలిపింది. బెర్త్ కావాలనుకుంటే మాత్రమే టిక్కెట్ తప్పని సరి అవుతుందని, లేనిపక్షంలో ఆ బెర్తు మరొకరికి కేటాయించనున్నట్లు వెల్లడించింది. అంతే తప్ప ఐదుసంవత్స రాలకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత ప్రయాణానికి రైల్వే అనుమతిస్తుందని, బెర్త్ విషయంలో తల్లిదండ్రులదే తుది నిర్ణయమని రైల్వే శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News