Monday, December 23, 2024

ఆటోనగర్ లారీల అడ్డాను త్వరలో తొలగిస్తా

- Advertisement -
- Advertisement -

వనస్థలిపురం : ఆటోనగర్ లారీల అడ్డ ఇక్కడి నుండి తరలించాలంటే చుట్టు పక్కల కాలనీ వాసుల సహయ సహకారాలు అవసరమని. ఇ ట్టి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దెవిరెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు. శనివారం హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని హైకోర్టు కాలనీ క మ్యూనిటీ హాల్‌లో తూర్పు కాలనీల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అడ్డదిడ్డంగా పెరుగుతున్న లారీలకు భారీ జరిమానాలు విధించాలని ట్రాఫిక్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

లారీల అడ్డ వలన చూట్టు పక్క కాలనీ వాసలు అనేక ఇబ్బందులకు గురవుచున్నారని పలు మార్లు నాదృష్టికి వచ్చిందని వెంటనే ఇక్కడ రాత్రిపూట పోలీస్ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని వనస్థలిపురం పోలీస్ ఉన్నత అధికారులకు సూచించారు. హైకోర్టు కాలనీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన ఐరన్ మెష్ జాలిని ప్రారంబించిన అనంతరం కాలనీ వాసులు స్వచ్చందగా ఏర్పిటు చేసుకున్న సిసి కెమెరాలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంబోత్సవం చేశారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఇసుక లారీల అడ్డా వలన రాత్రిపూట కాలనీ వాసులు రాకపోకలు చేయలేక మహిళలు, వృ ద్ధ్దులు, చిన్నారులు అనేక ఇబ్బందులకు గురవుచున్నారని ఎమ్మెలే తో కాలనీ వాసులు మెరపెట్టుకున్నారు. వెంటనే ఇసుక లారీల అడ్డా ఎత్తివేసి మాకు నా య్యం చేయాలని కాలనీ వాసులు కొరారు. మా కాలనీలో అక్కడక్కడ వరద కాలువలు నిర్మించి శ్వాశత పరిష్కరానకి నాంది పలుకాలని ఎమ్మెల్యే కు కా లనీ వాసుల వెల్లడించారు.

సుష్మ థియోటర్ దగ్గర ఉన్నటు వంటి రిజిస్ట్రేషన్ ఆఫీసును మరోక ప్రాంతానికి తరలించాలని, కాలనీలో మంచినీటి సమస్యతో పాటు డ్రైనేజీ సమస్య అదికంగా ఉన్నదని కాలనీ వాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్ళెం నవజీవన్ రెడ్డి, హయత్‌నగర్ సర్కిల్ 3 డిప్యూటి కమీషనర్ మారుతి దివాకర్, ఎల్బీనగర్ సర్కిల్ వాటర్ వర్క్ మేనేజర్ వినోద్ కుమార్, హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి,

మన్సూరబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, ట్రాఫిక్ ఏ.సి.పి హరికృష్ణ, ఈస్టర్ కాలనీల వెల్పేర్ అసోసియేషన్ అద్యక్షులు దీపావళి శ్రవణ్ కుమార్, కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి బాదం శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, నరసింహారావు, ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, సుదాకర్ రెడ్డి భారత్ సింగ్, సుదీర్ రెడ్డి, శ్రీకాంత్, జలందర్, ప్రవీణ్ గౌడ్, చ్రంద్రశేఖర్ రెడ్డి, సునిల్ కుమార్, మాదవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News