ఎల్బీనగర్: ఆటోనగర్ ఇసుక లారీల అడ్డా తొలగింపు చేయనున్నట్లు ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆటోనగర్ లోపల 11 ఎకరాల స్థ్దలాల్లో ఉన్న స్థలాన్ని టిఎస్ ఐఐ సీఏం.డి నర్సింహ్మరెడ్డి, మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డిలతో కలిసి ఐలా స్థ్దలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుక లారీల అడ్డాతో 15 కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో ఔటర్ రింగ్‌రోడ్డు వద్దకు తరలించాలని ప్రతిపాదనలు చేయడం జరిగిందని తెలిపారు.
ఇసుక లారీల కోసం ఎక్కడ స్థలం అనుగుణంగా ఉంటే ఆ స్థలంలోకి లారీల అడ్డా తరలించడం జరుగుతుందన్నారు. అతి త్వరలోనే లారీల బెడద నుంచి ప్రజలకు విముక్తి లభిస్తుందని రాబోయే రోజుల్లో ఇసుక లారీలు ఆగకుండా చూస్తామని తెలిపారు. ఆ స్థలంలో మూత్ర శాలలు, తాగునీటి సౌకర్యం, వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రధాన సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారం నెరవేరుస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో మేనేజర్ రవి, డివిజన్ అధ్యక్షులు మల్లారెడ్డి , నాగరాజు, రుద్ర యాదగిరి, జగదీష్ యాదవ్ , రఘువీర్‌రెడ్డిలు పాల్గొన్నారు.