Thursday, January 23, 2025

డిసెంబర్ పోయి ఆగస్టు వచ్చె

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ మంచిర్యాల ప్రతినిధి: కాం గ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని బోగస్ మాటలు చెప్పి మోసం చే స్తోందని, రైతు లు, ప్రజలు మోసపోయి గోసపడవద్దని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. రుణమాఫీ గడువు డి సెంబర్ పోయి ఆగస్టు వచ్చిందన్నారు. మంచిర్యా ల పట్టణంలో శనివారం రాత్రి జరిగిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ..ఐదు నెలల కింద తెలంగాణ ఎలా ఉండేదని, ఇంత ఆగం ఎందుకైందో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. సాగునీరుకు, మంచినీళ్లకు, కరెంటుకు, అన్ని రకాల వాతావరణాలకు మంచిగా ఉన్న తెలంగాణలో స్వల్ప కాలంలోనే ఎలాంటి మార్పులు వచ్చాయో గమనించాలన్నారు. ఇప్పుడు కరెంటు కోతలు ఎం దుకు అవుతున్నాయని ప్రశ్నించారు. పట్టణాల్లో ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చామని, అం దించిన నీళ్లు ఇప్పుడు ఎ క్కడికి మాయమయ్యాయన్నారు. సిఎం రిలీఫ్‌ఫండ్, కల్యాణలక్ష్మి చెక్కు లు ఎందుకు రావడం లేదన్నారు.

అరచేతిలో వై కుంఠం చూపి ఆరు గ్యారంటీలు అని చెప్పి కాం గ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. రెండు లక్షల రుణ మాఫీ అయిందా, రైతు బంధు అందరికీ వచ్చినా, రూ.2500 ప్రతి మహిళకు వస్తున్నా యా అని ప్రజలను ప్ర శ్నించారు. ఆరు గ్యారంటీలు అని కాంగ్రెస్ చెబితే ఆరు గ్యారంటీల్లో ఒకటే పథకం మహిళలకు ఫ్రీ బస్సు అమలు చేశారని,దీనివల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫ్రీ బస్సు వల్ల ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరు మీద అభివృద్ధి చేసుకున్నామని, కానీ పల్లెల్లో ఇపుడు ఇవన్నీ మాయం అవుతున్నాయని అన్నారు. మున్సిపాలిటీల్లో ఊడ్చే పరిస్థితి లేదని, పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయని, క్రీడా ప్రాంగణాల్లో చెట్లు మొలుస్తున్నాయని, మున్సిపాలిటీలో చెత్త పేరుకుపోతుందని అన్నారు.

బిఆర్‌ఎస్ ప్రారంభించిన చెన్నూరు ఎత్తిపోతల పథకం ఆపేశారన్నారు. మంచిర్యాల ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను కూడా నిలిపివేశారని, ఎందుకు దీనిని ఆపివేశారని ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే అన్ని పనులను నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. కరెంటు రాక లక్షల ఎకరాల్లో పంటలు ఎండబెట్టారన్నారు. వరి పంటకు రూ.5 వందల బోనస్ ఇస్తామని బోగస్ మాటలు చెప్పారని, కనీసం రైతులు పడించిన ధాన్యం కొనే దిక్కు కూడా లేదన్నారు. పాత ఆదిలాబాద్ జిల్లాలో మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాను రద్దు చేస్తానని, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలను రద్దు చేస్తానన్నారని, మంచిర్యాల జిల్లా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని అన్నారు. గ్రామాలు, పట్టణాలు పోయాయని, కనీసం స్ట్రీట్ లైట్లు రిపేరు చేసే పరిస్థితి లేదని, కెసిఆర్ కిట్లు, న్యూట్రిషియన్ కిట్లు, కళ్యాణలక్ష్మి చెక్కులు లేవని,

విదేశాలకు వెళ్లే విద్యార్ధులకు స్కాలర్‌షిప్ నిలిపివేశారని, కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్‌లు తేవడం లేదన్నారు. అన్ని రంగాల్లో పనులను నిలిపివేశారని అన్నారు. పనులకు మంచి చేసే పనులను కొనసాగిస్తారే తప్ప రద్దు చేయరని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులను పట్టించుకోకుండా అన్నీ నిలిపివేస్తామని మూర్ఖంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. 26 ఏండ్లు సింగరేణి కార్మికుడిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ గెలిస్తే సింగరేణిని కాపాడుతారన్నారు. సింగరేణి పోతే మన బతుకులు ఏ విధంగా ఉంటాయో ఆలోచన చేయాలన్నారు. మొండి వైఖరితో కాంగ్రెస్ ప్రభుత్వం శిక్షిస్తోందని, రైతుల నోట్లో మన్ను కొట్టిందన్నారు. రైతులకు కరెంటు,సాగు నీరు ఇవ్వలేదన్నారు. గోదావరి నదిని నరేంద్ర మోడీ ఎత్తుకెళ్తానంటున్నారని, ముఖ్యమంత్రి దీనిపై స్పందించడం లేదని, గోదావరి తీసుకెళ్లి తమిళనాడుకు ఇస్తానంటున్నా స్పందించడం లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో బిఆర్‌ఎస్ ఎంపిలు ఉండాల్సిన అవసరం ఉందని, మన హక్కులు, నిధులు, సింగరేణి ప్రైవేటు కావద్దన్నా, యదావిధిగా తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా తప్పకుండా బిఆర్‌ఎస్ ఎంపిలు గెలవాలన్నారు.

వీటిపై నిలదీస్తే సిఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, కెసిఆర్‌ను జైలుకు పంపుతా అని మాట్లాడుతున్నారని, జైళ్లకు భయపడే వ్యక్తి కెసిఆర్ కాదని అన్నారు. ఒక లక్షా 30 వేల మందికి దళితబంధు మంజూరు చేసిందని, ఆ డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం వాపస్ తీసుకుందన్నారు. దళితులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గిరిజనులకు 4 లక్షల ఎకరాల పోడు భూములు ఇచ్చామని, నేడు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. ఆగర్భ శ్రీమంతుడికి, భూగర్బ కార్మికుడికి పోటీ నడుస్తోందని, మరి కార్మికుడు గెలవాలా, శ్రీమంతుడు గెలవాలో ఆలోచించాలని అన్నారు. బిజెపితో ఒరిగిందేమీ లేదని, బిఆర్‌ఎస్‌నే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. భారీ మెజారిటీతో కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మాజీ ఎంఎల్‌ఎలు బాల్క సుమన్, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, ఇతర నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News