Wednesday, January 22, 2025

ఆటోలకు మీటర్లు ఉండవు.. బైక్ ట్యాక్సీలకు లైసెన్సులు ఉండవు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్‌టిసి తర్వాత ప్రయాణికులకు రవాణ సౌకర్యం కల్పిస్తున్న అతి పెద్ద ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ ఆటోలు, గత కొన్ని సంవత్సరాలుగా మీటర్ లేకుండా ఇష్టం వచ్చినవిధంగా చార్జీలు వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం రవాణశాఖ, తూనికలు కొలతల మద్య సమన్వయం లేక పోవడమే కారణమనే అభిప్రాయం ప్రయాణికుల్లో వ్యక్తం అవుతోంది.వాస్తవానికి నగరంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేఆటోలకే మీటర్లు బిగించాల్సిన భాద్యత తూనికలు, కొలతల అధికారులది కాగా ఎంత దూరానికి ఎంత మొత్తం చార్జ్ తీసుకోవాలని నిర్ణయించేది రవాణశాఖ అధికారులది. అంతే కాకుండా ఆటోల్లో ప్రయాణికులను సామర్ధానికి మించి తీసుకెళ్ళినా, ప్రయాణికులు కోరిన ప్రాంతానికి తీసుకెళ్ళాలని అడిగినా సదరు ఆటో వాలాలపై ట్రాఫిక్ పోలీసులు కేసులు బుక్ చేయవచ్చు. కానీ సదరు శాఖల మద్య సమన్వయం లేక పోవడంతో వారు ప్రయాణికులను నిలువుదోపిడి చేస్తున్నారు. కిలో మీటర్‌కు ప్రారంభ చార్జీగా రూ . 20ను ఎనిమిది సంవత్సరాలు క్రితం రవాణశాఖ అధికారులు నిర్ణయించారు.

పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజీ చార్జీలు 8 సంవత్సరాల కిత్రం ఉన్న చార్జీల కంటే 50 శాతం అధికంగా పెరిగాయని నాటి ధరలతో తమకు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్లులో 60 నుంచి 70 శాతం మంది డ్రైవర్లు మీటర్ వేయడం ఎప్పుడో మరిచిపోయారు. రెండు మూడు కిలో మీటర్లకు వచ్చేందుకు రూ.80 నుంచి 100 చార్జీ వేస్తున్నారు. మరో వైపు రవాణశాఖ అనుమతులు లేకుండా ఓలా ఉబర్, రాపిడో వంటి బైక్ ట్యాక్సీలు విచ్చలవిడిగా తిగుతున్నాయి. కొన్ని సంస్థలు సదరు వ్యక్తులకు లైసెన్స్ ఉన్నా లేక పోయినా బైక్ ట్యాక్సీలు నడుపుకునే విధంగా యువతను ప్రకటనల ద్వారా ప్రోతహిస్తున్నాయి. వాస్తవానికి తెలుపు రంగులో ఉన్న నంబర్ ప్లేట్లపై నిబంధనల ప్రకారం ట్రాన్స్‌పోర్టు సేవలకు ఉపయోగించ కూడదు. ఎల్లో నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలనే ట్రాన్స్‌పోర్టు వ్యవహరాలకు వినియోగించాలి కాని వీటిని అటు సంస్థలు కాని, ఇటు అధికారులు కాని పట్టించు కోక పోవడంతో లెక్కకు మించి బైక్ ట్యాక్సీలు రోడ్డుమీదకు వస్తున్నాయి. వీటితో ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News