Sunday, December 22, 2024

నేడు ఆటోల బంద్

- Advertisement -
- Advertisement -

పిలుపునిచ్చిన మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి
రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్:  నగరంలో నేడు శుక్రవారం (ఫిబ్రవరి 16వ తేదీ)న ఆటోల బంద్‌కు యూనియన్ నాయకులు పిలుపు నిచ్చారు. మహాలక్ష్మీ పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని, రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్ర మోటార్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ జేఏసీ డిమాండ్ చేసింది.

ఉచిత బస్సుల వల్ల ఆర్థికంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 15 వేలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో నేడు ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటోర్యాలీ నిర్వహించనున్నట్టు యూనియన్ నాయకులు తెలిపారు. నేడు ఆటోల బంద్‌కు సంబంధించి తెలంగాణ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు (జేఏసి) రవాణాశాఖ కమిషనర్‌ను కలిసి సమ్మె నోటీసుచ్చింది. ఈ బంద్‌కు క్యాబ్‌లు, డిసిఎం, లారీ డ్రైవర్‌లు కూడా మద్ధతు తెలిపినట్టు ఆటో యూనియన్ నాయకులు తెలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News