Tuesday, November 5, 2024

మంచు చరియలు విరిగిపడి రష్యా స్కీయిర్ మృతి

- Advertisement -
- Advertisement -

గుల్మార్గ్ : జమ్ముకశ్మీర్ లోని గుల్మార్గ్ మంచు పర్వత సాణువుల్లో గురువారం మంచు చరియలు విరిగిపడి రష్యా స్కీయిర్ మృతి చెందగా, శిధిలాల నుంచి స్థానిక గైడ్‌తో సహా మరో ఆరుగురిని సహాయ బృందాలు రక్షించాయి. గుల్మార్గ్ లోని కొంగ్‌డోరి వాలుప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల నుంచి బయటపడిన ఆరుగురు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీస్ అధికారులు, టూరిజం విభాగానికి చెందిన స్కీ పెట్రోలింగ్

బృందాలు సమన్వయంతో సహాయ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా హెలికాప్టర్లను కూడా ఉపయోగించారు. గుల్మార్గ్‌లో ప్రస్తుతం జరుగుతున్న నాల్గవ ఖేలో ఇండియా శీతాకాల క్రీడా కార్యక్రమాలపై ఈ ప్రమాద ప్రభావం పడలేదు. క్రీడాకారులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా బుధవారం వరకు ఇక్కడ స్కీయింగ్ చేశారు. స్కీయర్లు క్షేమంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News