- Advertisement -
హైదరాబాద్: లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ ఆవేశ్ ఖాన్ తల్లి కంటనీరు పెట్టుకున్నారు. ఐపిఎల్ మ్యాచ్‌లో లక్నో బౌలర్ ఆవేశ్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆవేశ్ తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడు వద్దకు వచ్చి అతడికి హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లక్నో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆవేశ్ ఖాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
- Advertisement -