Monday, January 20, 2025

కోలుకుంటున్న విమాన రంగం

- Advertisement -
- Advertisement -

విమాన ఇంధనంపై
అదనపు పన్ను వెనక్కి
అంతర్జాతీయ విమానాలకు వినియోగించే ఎటిఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్)పై ఇటీవల విధించిన అదనపు పన్నును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఎటిఎఫ్ ఎగుమతులపై లీటరుకు రూ.6 చొప్పున అదనపు పన్ను, 11 శాతం బేసిక్ ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపు పెంపు వంటి నిర్ణయాలను జూన్ 30న కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. విమా న సంస్థను దృష్టిపెట్టుకుని ప్రభుత్వం మళ్లీ ఈ రెండు నిర్ణయాలను ఉపసంహరించుకుంది.

దేశీయ, విదేశీ విమాన ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి
కరోనా ముందు స్థాయికి చేరుకున్న రద్దీ

Ransomware Attack on SpiceJet

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విమానయాన పరిశ్రమ వేగంగా కోలుకుంటోంది. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసిన మూడు నెలల్లోనే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సంఖ్య కోవిడ్‌కు ముందు ఉన్న స్థాయిలో 79 శాతానికి నమోదవుతోంది. దేశీయ ప్రయాణీకుల సంఖ్య కూడా కోవిడ్ ముందు స్థాయిలో 91 శాతం నమోదైంది. ఈ ఏడాది విమాన ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
మార్చిలో నిషేధం ఎత్తివేత
కరోనా కారణంగా 2020 మార్చిలో అంతర్జాతీయ విమానాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 2022 మార్చి 27న అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. అప్పటి నుంచి అంతర్జాతీ య ప్రయాణీకుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. జూన్‌లో 44 లక్షల మంది ప్రయాణికులు అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించారు. అంతకుముందు మే నెలలో 40.75 లక్షల మంది ప్రయాణికులతో పోలిస్తే ఇది 8 శాతం పెరిగింది. ఈమేరకు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా విడుదల చేసిన నివేదికలో ఈ సమాచారం ఉంది. అయితే జూన్‌లో దేశీయ ప్రయాణికుల సంఖ్య 2.11 కోట్లకు తగ్గింది. ఇది ప్రీ-కోవిడ్‌లో 91 శాతానికి సమానం. ఏప్రిల్-, మేలో దేశీయ ప్రయాణీకుల సంఖ్య కోవిడ్‌కు ముందు 98 శాతానికి చేరుకుంది. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరుచుకోవడమే దేశీయంగా ప్రయాణికులు తగ్గడానికి కారణమని ఇక్రా పేర్కొంది. దీని వల్ల దేశీయ పర్యాటకం తగ్గిపోతోంది.
పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య
దేశీయంగా, దాంతో పాటు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు పుంజుకుంటున్నాయి. ఇప్పుడు థాయిలాండ్, వియత్నాం, దుబాయ్ వంటి పెద్ద అంతర్జాతీయ గమ్యస్థానాలు కూడా ప్రారంభించడంతో ప్రయాణికులు పెరుగుతున్నారు. ప్రయాణ ఆంక్షలు ఎత్తివేశారు. వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేసిన తర్వాత తర్వాత చాలా ప్రదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభిస్తోంది. రెండేళ్లుగా అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండడంతో టూరి జం కోసం ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు. విమానయాన సంస్థలు కూడా సేవలను వేగ ంగా పెంచాయి. దీని కారణంగా సీట్ల కొరత కూడా లేదు. గత మూడు నెలల్లో అంతర్జాతీయ ట్రాఫిక్‌లో గణనీయమైన పెరుగుదల ఉందని ఇక్రా సీనియర్ విశ్లేషకుడు అభిషేక్ లహోటి అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విమాన ముందు స్థాయిలో చేరుకుంటుందని అంచనా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News