Sunday, December 22, 2024

నటి అవికా గోర్ కు బాడీగార్డ్ లైంగిక వేధింపు

- Advertisement -
- Advertisement -

ముంబై: నటి అవికా గోర్ 2008లో ‘బాలికా వధు’ టివి షోతో పేరుతెచ్చుకుంది. తన చిన్నతనంలో మంచి, చెడు అనుభవాలు తాను చవిచూశానని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. హటర్ ఫ్లయ్ డాట్ కామ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలు తెలిపింది.

ఇంటర్వ్యూలో ‘మీరెప్పుడైన టీజింగ్ కు గురయ్యారా?’ అని ప్రశ్నించినప్పుడు, ‘కజఖ్ స్థాన్ లో అలాంటివి చాలానే జరిగాయి. నా చుట్టూ ఎప్పుడూ బాడీగార్డులు ఉండేవారు. అయినా ఒకరు నాతో చాలా స్మార్ట్ గా వ్యవహరించారు. ఓ ఈవెంట్ లో నేను స్టేజి మీదకు వెళుతున్నప్పుడు నన్ను ఎవరో తాకారు. కానీ నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు నా బాడీ గార్డ్ తప్ప ఎవరూ కనిపించలేదు. నన్ను రక్షించే బాడీగార్డే అలా చేశాడు’ అని చెప్పుకొచ్చింది.

‘కానీ రెండోసారి కూడా అలా జరిగేప్పుడు…నన్ను తాకే ఆ చేయిని పట్టుకున్నాను. అది ఆ బాడీగార్డే’.  నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసహ్యించుకుని ముందుకు కదిలిపోయాను. ‘‘ఏమి చేయాలి? వారికి ఇంగ్లీషు, హిందీ రాదు. అందుకే వారిని వదిలేశాను. అంతకు మించి ఏమి చేయగలను’ అని చెప్పుకొచ్చింది.

షూటింగ్ కు వెళ్లేప్పుడు ఎలా వ్యవహరించాలో నా తల్లి నాకు చెప్పిందని అవికా తెలిపింది. శరీరాన్ని తాకుతారని తెలిపింది. మనం నివసిస్తున్న సమాజంలో కొన్ని నమ్మ శక్యం కానివి జరుగుతుంటాయి’ అని అవికా గోర్ తెలిపింది.

అవికా 2013లో టాలీవుడ్ లోకి కూడా ప్రవేశించింది. ఆమె తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లో నటించింది. త్వరలో ఆమె హిందీ సినిమా ‘బ్లడీ ఇష్క్’లో కనిపించబోతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News