Saturday, November 2, 2024

సుదీర్ఘంగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వాదనలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైకాపా ఎంపి అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తాజా పరిణామాలతో అనుబంధ కౌంటర్ దాఖలు చేసింది సిబిఐ. అవినాష్ తరుఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ…. ఎఫ్ఐఆర్, దర్యాప్తు, కోర్టుల్లో జరిగిన పరిణామాలపై అవినాష్ రెడ్డి లాయర్ వివరణ ఇచ్చారు. అవినాష్ నిందితుడని రికార్డుల్లో సిబిఐ ఎక్కడా చెప్పలేదని అవినాష్ లాయర్ తెలిపారు. గుండెపోటు అన్నంత మాత్రాన నేరం చేసినట్లే అనడం సరికాదని లాయర్ వెల్లడించారు. అవినాష్ వైద్యుడో, పోలీసు అధికారో కాదు కధా? ప్రశ్నించారు.

ఏ1 గంగిరెడ్డికి వివేకాతో భూవివాదాలు ఉన్నాయని తెలిపారు. సునీల్, ఉమాశంకర్ కు వివేకాతో వజ్రాల వ్యాపారంలో విబేధాలున్నాయి. తమ కుటుంబ మహిళల విషయంలోనూ వారికి వైకాపా కోపం ఉందన్నారు. వివేకా.. డ్రైవర్ గా దస్తగిరిని తొలగించి ప్రసాద్ ను పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి అవినాషే కారణమని వివేకా భావించారు. వివేకా ఓటమికి కారణాలను సాక్షులే వివరించారు. స్థానిక నేతలు సహకరించకే ఓడిపోయారని సాక్షులు వాంగ్మూలం ఇచ్చారన్నారు.

దస్తగిరి తీసుకున్న రూ. కోటీలో రూ.46.70 లక్షలే రివకరీ అయ్యాయని తెలిపారు. మిగితా సొమ్ము ఏమైందో సిబిఐ చెప్పడం లేదని న్యాయవాది ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపి టికెట్ పై అవినాష్ రెడ్డిను సిబిఐ అనుమానిస్తోంది. సిబిఐ ఎఫ్ఐఆర్ లో ఐపిసి 302 మాత్రమే నమోదు చేసిందని న్యాయవాది తెలిపారు. సిబిఐ ఎఫ్ఐఆర్ లో 201 సెక్షన్ లేదన్నారు. అప్పటికే ఉన్న ఎఫ్ఐఆర్ ను యథాతథంగా నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని సిబిఐ వెల్లడించింది.

హత్య చేసిన దస్తగిరిని సిబిఐ వెనుకేసుకోస్తోందని ఆయన ఆరోపించారు. దస్తగిరి ముందస్తు బెయిల్ ను సిబిఐ వ్యతిరేకించలేదన్నారు. గంగిరెడ్డి డీఫాల్డ్ బెయిల్ పై సునీత కోర్టుకు వెళ్లారు. దస్తగిరి బయట తిరుగుతుంటే సునీత స్పందించట్లేదన్నారు. 2 గంటలుగా అవినాష్ రెడ్డి వాదనలు కొనసాగుతున్నాయి. వాదనల్లో వేగం పెంచాలని అవినాష్ న్యాయవాదికి హైకోర్టు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News