Sunday, December 22, 2024

నేడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో విచారణ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: శుక్రవారం సుప్రీం కోర్టులో వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంపై సునీత పిటిషన్ వేశారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత పిటిషన్ వేశారు. ఈ నెల 25 వరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సునీత పిటిషన్‌పై నేడు సిజెఐ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వివేకా హత్య కేసులో ఎంపి అవినాశ్ రెడ్డిని సిబిఐ నిందితుడిగా గుర్తించి పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం విధితమే.

Also Read: సమంత ఒంటిపైన చెరిగిపోని పచ్చబొట్టు నాగచైతన్యదే!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News